1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
  4. Coriander leaves, kottimeeri health benefits

కొత్తిమీరి ఆకు రసం, కషాయంతో ఆరోగ్యం

సువాసన ద్రవ్యంగా కొత్తిమీరి ఆకులను వాడుతారన్నది తెలిసిందే. ఈ కొత్తిమీరి ఆకు 25 గ్రాములు తీసుకుని దానిలో 100 గ్రాములు నీళ్లు పోసి 25 గ్రాముల కషాయం మిగిలేట్లు కాచి దించి వడబోసిన ద్రవాన్ని పుక్కిట పడితే పంటి నొప్పులు, చిగుళ్ల వాపులు తగ్గిపోతాయి. ఇలా చేయ

Coriander leaves
సువాసన ద్రవ్యంగా కొత్తిమీరి ఆకులను వాడుతారన్నది తెలిసిందే. ఈ కొత్తిమీరి ఆకు 25 గ్రాములు తీసుకుని దానిలో 100 గ్రాములు నీళ్లు పోసి 25 గ్రాముల కషాయం మిగిలేట్లు కాచి దించి వడబోసిన ద్రవాన్ని పుక్కిట పడితే పంటి నొప్పులు, చిగుళ్ల వాపులు తగ్గిపోతాయి. ఇలా చేయడం వల్ల గొంతు నొప్పి కూడా తగ్గుతుంది. ఈ కషాయంలో కొద్దిగా బెల్లం, కొంచెం అల్లం రసం కలిపి తాగితే గొంతు నొప్పులు, శ్వాసకోస ఇబ్బందులు తగ్గుతాయి. 
 
ప్రసవంలో నొప్పులతో బాధపడేవారికి కొత్తిమీరి ఆకులను నలిపి దాని సువాసన చూపిస్తుంటే సుఖప్రసవం అవుతుందని ఆయుర్వేద శాస్త్రం చెపుతుంది. ఇంకా కండ్ల కలకతో బాధపడేవారికి ఈ ఆకు రసాన్ని చనుబాలలో కలిపి ఒకటి రెండు చుక్కలు కంటిలో వేస్తే తగ్గిపోతుంది.
About Writer
chj
తర్వాతి కథనం
శృంగారంలో భర్తను భార్య డామినేట్ చేస్తే భరించలేడా?