1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
  4. Health Benefits of Amla

Amla: ఫ్యాటీ లివర్ సమస్యకు ఉసిరికాయ.. కొవ్వుకు చెక్

Amla
మహిళల్లో ఫ్యాటీ లివర్ సమస్యకు ఉసిరికాయ ఎంతగానో మేలు చేస్తుంది. ఇవి కాలేయంలో పేరుకుపోయిన అనవసరపు కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతిరోజూ ఉదయాన్నే ఒక పచ్చి ఉసిరికాయను తినడం లేదా తాజా ఉసిరి రసాన్ని సేవించడం వల్ల కాలేయ పనితీరు గణనీయంగా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపి, రక్తాన్ని శుద్ధి చేయడం ద్వారా కాలేయానికి కొత్త జవజీవాలను అందిస్తాయి. 
 
ఉసిరికాయ జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచి కాలేయ సంబంధిత వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది. ఉసిరి కాయతో ఫ్యాటీ లివర్ సమస్యను ప్రాథమిక దశలోనే అరికట్టవచ్చు. షుగర్‌ వ్యాధిని అదుపులో ఉంచేందుకు ఉసిరి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. 
 
ఇందులో ఉండే క్రోమియం షుగర్‌ను అదుపులో ఉంచేందుకు తోడ్పడుతుంది. గుండె కవాటాలు మూసుకుపోకుండా క్రోమియం నివారిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
ఎంజీఎం మలర్ హెల్త్‌కేర్ ఆస్పత్రిలో అతి క్లిష్టమైన ఆపరేషన్ సక్సెస్