1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
  4. Olive oil benefits for women

స్త్రీల లైంగిక ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే?

Olive oil benefits for women
స్త్రీల లైంగిక ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే ఆలివ్ ఆయిల్‌తో వంట చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆలివ్ నూనెతో వంటలు చేసుకునేవారికి లేదా ఆలివ్ నూనెను ఇతరత్రా శరీరంలోకి తీసుకునే స్త్రీల లైంగిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని ఇటలీ దేశ పరిశోధకులు తేల్చారు. 
 
ఇటువంటి వారిలో అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం కనీసం 30 శాతం తగ్గుతుంది. ఆలివ్‌లో ఉన్న ఆరోగ్యకర కొవ్వులు క్యాన్సర్ కారక అంశాలను అణచివేస్తాయి. 
 
అలాగే గుండె సంబంధిత రోగాలను దూరం చేసుకోవాలంటే.. ద్రాక్షరసం లేదా ద్రాక్ష పండ్లు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ద్రాక్షలో నల్ల ద్రాక్ష, లేతపచ్చ ద్రాక్ష ఉంటాయి. 
 
ఈ ద్రాక్షలో ఫ్లావనాయిడ్స్ అధికం. ఈ ఫ్లావనాయిడ్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. గుండెతో పాటు మెదడును కూడా ద్రాక్ష రక్షిస్తుంది. ద్రాక్షరసం అధిక రక్తపోటును నిరోధిస్తుంది. 
About Writer
Selvi