కొన్ని సార్లు మొటిమలు పోయి మచ్చలు మాత్రం మిగిలిపోతుంటాయి. అలాంటప్పుడు కొబ్బరి పాలతో ప్యాక్ వేసుకుంటే ఫలితం ఉంటుందని చెప్తున్నారు బ్యూటీషన్లు. మరి ప్యాక్ ఎలా వేసుకోవాలంటే.. కొబ్బరిపాలలో స్పూన్ గులాబీ నీరు, నిమ్మరసం కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి గంటపాటు అలానే ఉంచుకోవాలి. ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే.. ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే తప్పక మచ్చలు పోతాయి....