శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : గురువారం, 17 జనవరి 2019 (13:58 IST)

ముల్లంగిని నానబెట్టిన నీటిలో యాలకులను రుబ్బి సేవిస్తే...?

చాలామంది నోటి దుర్వాసనను పోగొట్టుకునేందుకు యాలకులను నోట్లో వేసుకుంటుంటారు. ఈ యాలకులు రెండు రకాలలో లభిస్తాయి. చిన్న యాలకులు లేదా పెద్ద యాలకులు. పెద్ద పెద్ద యాలకులు తినుబండారాలలో సువాసన కోసం ఉపయోగిస్తారు. అదే చిన్న యాలకులు తీపి పదార్థాలలో కలుపుతుంటారు. మనం తినే ఆహార పదార్థాలలో మాత్రమే వీటిని ఉపయోగించుకుంటామనుకుంటే పొరపడినట్లే. ఇందులో ఔషధ గుణాలు అధిక మోతాదులో ఉన్నాయని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ ఔషధ గుణాలేంటో చూద్దాం. 
 
ఈ చలికాలం కారణంగా జలుబు, దగ్గు, తుమ్ములు ఎక్కువగా వస్తుంటాయి. ఇలా ఉన్నప్పుడు యాలకులు, అల్లం ముక్క, లవంగ, ఐదు తులసి ఆకులు కలిపి సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. 
 
వాంతులు అయినప్పుడు అరలీటరు నీటిలో 5 గ్రాముల యాలకులను వేసి ఉడకించుకోవాలి. ఈ మిశ్రమం బాగా కాగిన తర్వాత నీరు 1/4వ వంతు వచ్చినప్పుడు తీసి ఆ నీటిని సేవిస్తే వాంతులు తగ్గి, శరీరంలోని నీరసం తగ్గుతుంది. 
 
నోట్లో పొక్కులతో బాధపడేవారు యాలకులతోపాటు కలకండను కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నాలుకపై కాసేపు అలానే ఉంచుకోవాలి. దీంతో వెంటనే ఉపశమనం కలుగుతుంది.
 
గొంతులో వాపు సంభవిస్తే ముల్లంగిని నానబెట్టిన నీటిలో యాలకులను రుబ్బి సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. దగ్గుతో ఇబ్బంది పడి గొంతులో (కిచ్ కిచ్) మంట, బొంగురు పోయినట్లైతే ఉదయం లేవగానే యాలకలను నమిలి తినావి. ఆ తర్వాత గోరువెచ్చని నీటిని త్రాగాలి. ఇలా తరచుగా చేస్తే ఉపశమనం కలుగుతుంది.