ద్రాక్ష రసంలో పంచదార కలపకుండా త్రాగితే ఏమవుతుంది?
సాధారణంగా సీజనల్ ప్రూట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఏ సీజన్లో వచ్చే పండు ఆ సీజన్లో తీసుకోవటం వలన మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా మన శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు, విటమిన్లు, మినరల్స్ అందుతాయి. ముఖ్యంగా నల్ల ద్రాక్షలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది వ్యాధి నిరోధకతను పెంచడంలో సహాయం చేస్తుంది. వీటి ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
1. ద్రాక్ష రసంను క్రమంతప్పకుండా తీసుకోవడం వలన గుండె పోటును నివారించుకోవచ్చు.
2. ద్రాక్ష రసం త్రాగడం వలన హై బీపి అదుపులో ఉంటుంది.
3. ద్రాక్ష రసంలో పంచదార కలపకుండా త్రాగడం వలన తలనొప్పి తగ్గుతుంది.
4. ద్రాక్ష రసంను తరచూ తీసుకోవడం వలన మెటబాలిజం రేటు పెరుగుతుంది.
5. ద్రాక్షలో విటమిన్ కె మరియు పొటాషియం అధికంగా ఉండటం వలన చర్మం పొడిబారకుండా చేసి చర్మానికి మంచి నిగారింపును ఇస్తుంది.
6. అసిడిటితో బాధపడేవారు రోజూ ఒక గ్లాసు తాజా ద్రాక్షా రసం తాగడం వలన అసిడిటి తగ్గుముఖం పడుతుంది.
7. ద్రాక్షలో సెల్యులోజ్, ఆర్గానిక్ ఆసిడ్ మరియు షుగర్ వంటివి మలబద్ధకాన్ని నివారించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అందువల్ల మలబద్దకంతో బాధపడేవారు ద్రాక్షను తినడం వల్ల చాలా మేలు జరగుతుంది. ద్రాక్ష రసం కడుపులోని ప్రేగులను శుభ్రపరచడంతో పాటు దీర్ఘకాలంగా ఉన్న మలబద్దక సమస్యను నివారిస్తుంది.
8. జీవం కోల్పోయిన జుట్టుకు ద్రాక్ష గింజలు చక్కని ఔషధంలా పనిచేస్తాయి. వాటిల్లోని ఫ్యాటీ ఆమ్లాలు శిరోజాలకు పోషణను అందించి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ రక్త ప్రసరణను పెంచుతాయి. దాంతో శిరోజాలకు మంచి నిగారింపు వస్తుంది.