నిద్రలేమితో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి?
చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. మానసిక, ఉద్యోగ, కుటుంబ ఒత్తిడుల కారణంగా ఇలాంటి సమస్య ఉత్పన్నమవుతుంది. దీంతో మానసికంగానేకాకుండా, శారీరకంగా కూడా కుంగిపోతుంటారు. ఇలాంటి వారు చిన్నపాటి చిట్కాలు పాటించినట్టయితే నిద్రలేమ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
* నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి తేనె - పాలు చక్కటి ఔషధంగా పని చేస్తాయి. ప్రతి రోజూ రాత్రి నిద్రపోయేందుకు కనీసం అర్థ గంట ముందు ఈ మిశ్రమాన్ని తాగితే చాలు. నిద్ర చాలా చక్కగా పడుతుంది. ఉదయాన్నే యాక్టివ్‌గా ఉంటారు. సమస్య నుంచి ఒకటి రెండు రోజుల్లోనే బయటపడొచ్చు.
* పాలలో తేనె కలుపుకుని తాగడం వల్ల ఇన్ఫెక్షన్లు పోతాయి. శరీరంలో ఉండే బ్యాక్టీరియా, వైరస్, ఇతర క్రిములు నశిస్దాయి, శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జ్వరం, దగ్గు, జలుబు వంటి వ్యాధులు అంత సులభంగా దరిచేరవు.
* ఎముకలు విరిగివున్నవారు ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు పాలు, తేనె కలుపుకుని తాగడం వల్ల కాల్షియం శరీరానికి బాగా అందుతుంది. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. ఎముకలకు పటుత్వం చేకూరుతుంది. కీళ్ళ నొప్పులు, వాపులు తగ్గుతాయి.
* పాలలో తేనె కలుపుకుని తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. శరీరంలో ఎనర్జీ లెవెల్స్ సమతుల్యంగా ఉంటాయి. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అలాగే, వయసు మీదపడటం వల్ల చర్మంపై వచ్చే ముడతలు కూడా రావు. ఫలితంగా ఎప్పటికీ నిత్యం యవ్వనంగా కనిపిస్తారు. వృద్ధాప్యం దరిచేరదు.
* తేనె, పాలలో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి. చర్మాన్ని శుభ్రం చేస్తాయి. దీంతో చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. మచ్చలు, మొటిమలు పోతాయి. జీర్ణాశయం, పేగుల్లో చెడు బాక్టీరియా నాశనమవుతుంది. మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. దీంతో జీర్ణ సమస్యలైన గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటివి నయమవుతాయి.