శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : శనివారం, 5 జనవరి 2019 (17:18 IST)

కొత్తిమీర మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తే..?

నేటి తరుణంలో చాలామంది జుట్టుకి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టు ఎక్కువగా రాలిపోతుందని ఆందోళన.. ఈ సమస్యను తొలగించుకోవడానికి ఏవేవో ఇతర పదార్థాలు వాడుతారు. అయినను సమస్య తగ్గదు. ఇంకా ఎక్కువైపోతుందని చింతన.. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. రండీ..

కొబ్బరి పాలలో విటమిన్ ఇ అధిక మోతాదులో ఉంటుంది. ఇది జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. అందువలన తలస్నానం చేసే ముందుగా కొబ్బరిపాలను జుట్టు రాసుకుని గంటపాటు అలానే ఉంచి ఆపై స్నానం చేయాలి. ఇలా క్రమంగా చేస్తే జుట్టు రాలదు. వెంట్రుకలు మృదువుగా మారుతాయి.
 
కొబ్బరిపాలు ఎలా అప్లై చేయాలో చూద్దాం.. కప్పు కొబ్బరి పాలు తీసుకుని చేతి వేళ్లతో కొద్ది కొద్ది పాలు తీసి నుదిటిపై అప్లై చేయాలి. 20 నుండి 25 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తరువాత చల్లని నీటితో షాంపూ ఉపయోగించి తలస్నానం చేయాలి. కొబ్బరిపాలలోని పొటాషియం జుట్టు పెరుగుదలకు చాలా దోహదపడుతుంది.
 
జుట్టు పెరగడానికి కావలసినవి.. పొటాషియం, విటమిన్ సి, ఐరన్. ఈ మూడు ఖనిజాలు బంగాళాదుంపల్లో ఎక్కువగా ఉన్నాయి. బంగాళాదుంపను మెత్తని పేస్ట్‌లా చేసి అందులో స్పూన్ తేనె, కొద్దిగా నీరు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నుదిటి పాపటి భాగంలో రాయాలి. 30 నిమిషాల పాటు అలానే వదిలేయాలి. ఆ తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒక్కసారి చేసినా జుట్టు రాలకుండా ఉంటుంది.
 
కొత్తిమీర జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. కప్పు కొత్తిమీరను మెత్తగా రుబ్బుకోవాలి. అందులో 3 స్పూన్ల నీరు కలిపి పేస్ట్ చేసి జుట్టు పూతలా వేసుకోవాలి. గంటపాటు అలానే ఉంచాలి. ఆ తరువాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు నుండి మూడుసార్లు చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు కూడా రాదు.