బాదం గింజలతో చేసిన డార్క్‌ చాక్లెట్లలో..?

Last Updated: సోమవారం, 14 జనవరి 2019 (13:00 IST)
ఒత్తిడి దూరం కావాలంటే.. ఒక కప్పు ఉడికించిన ఓట్స్‌ తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఓట్స్‌‌లో మనిషిని ఉత్తేజితం చేసే సెరోటోనిన్‌ హార్మోన్స్‌ సమృద్ధిగా ఉంటాయి. వీటిలో ఉండే పీచుపదార్థం నిదానంగా జీర్ణం కావడంతో పాటు వీటికి రక్తపోటును అస్తవ్యస్తం కాకుండా నిలబెట్టే లక్షణం ఉంది. అయితే, ఓట్లలో పొడిని, ఒక చెంచా తేనె కూడా కలిపి తీసుకుంటే తీపి పట్ల ఉన్న కోరికా తీరుతుంది. వ్యాధి నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది.

సోయా పాలతో చేసిన కాఫీ తాగితే ఒత్తిడి మటాష్ అవుతుంది. వీటిలో గల ఫోలేట్‌ నిల్వల వలన మనసును ప్రశాంతపరిచే సెరటోనిన్‌ హార్మోన్లు పెరుగుతాయి. కాఫీతో కోకో పౌడర్‌ కలిపి తీసుకుంటే మనిషికి మేలు చేసే డొపామిన్‌ హార్మోన్లు పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అలానే బాదం గింజలతో చేసిన డార్క్‌ చాక్లెట్లలో సెట్రస్ హార్మోన్లను తగ్గించే గుణం పుష్కలంగా ఉంది. ఇది రక్తపోటును తగ్గించడంలో మందులతో సమానంగా పనిచేస్తుంది. బాదాం పప్పులో గొప్ప శక్తినిచ్చే ప్రొటీన్‌ కూడా ఉంది. ఇది మోనో శాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌కు ఎంతో మంచి చేస్తుంది. అలాగే డిప్రెషన్‌ను తగ్గించే శక్తి కూడా ఈ డార్క్‌ చాక్లెట్‌కు ఉంది.దీనిపై మరింత చదవండి :