గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : బుధవారం, 18 సెప్టెంబరు 2019 (12:36 IST)

పసుపుతో మెరిసే చర్మ సౌందర్యం మీ సొంతం... (video)

ఎక్కువ ధరలు చెల్లించి ఫేస్‌ప్యాక్‌లు, స్క్రబ్బర్‌లు వాడటం కంటే సహజసిద్ధంగా లభించే పసుపుని వాడటం మంచిదని బ్యూటీషియన్లు చెపుతుంటారు. పసుపు వాడకం వల్ల మెటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్‌ వంటి సమస్యలు తొలగిపోతాయి. పసుపుతో మాస్క్‌, స్క్రబ్బర్‌, ఫేస్‌ప్యాక్‌లను ఇంట్లోనే తయారు చేసుకుని మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చని సౌందర్య నిపుణులు అంటున్నారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం....
 
ముందుగా పసుపులో నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పావుగంట తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. 
 
పసుపులో ఒక టీస్పూన్‌, మీగడ, శెనగపిండి కలిపి స్క్రబ్‌ తయారు చేసి, చేతి వేళ్ల చివర్లతో ముఖంపై సున్నితంగా మర్దనం చేయాలి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోవడమే కాకుండా చర్మం కాంతివంతంగా ఉంటుంది.
 
పసుపులో బియ్యపు పిండి, టొమాటో రసం, పాలు కలిపి పేస్ట్‌లా చేయాలి. తర్వాత ఈ మాస్క్‌ని ముఖానికి, మెడకు వేసుకుని అరగంటసేపు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కడిగేయాలి. అంతే మెరిసే చర్మం మీ సొంతం.