గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Modified: బుధవారం, 11 సెప్టెంబరు 2019 (14:09 IST)

గులాబీ రేకుల్లాంటి పెదవులు మీ సొంతం అవ్వాలనుకుంటున్నారా?

పెదవుల్లో తేమ తగ్గిపోవడం వల్లే అవి పొడిబారినట్లు కనబడతాయి. దీన్ని తగ్గించి గులాబీ రేకుల్లాంటి పెదవులు పొందాలంటే ఈ టిప్స్ పాటించండి. ముందుగా చిన్నారులు వాడే టూత్‌బ్రస్‌తో పెదవుల్ని మృదువుగా రుద్దాలి. ఇలాచేస్తే మృతచర్మం తొలగిపోతుంది. నిగారింపూ సంతరించుకుంటాయి. 
 
* బ్లాక్ టీ బ్యాగును గోరు వెచ్చని నీటిలో ముంచండి. 5 నిమిషాలయ్యాక ఈ బ్యాగును నేరుగా పెదవులపై ఉంచండి. ఇలా నాలుగైదుసార్లు చేస్తే చాలు అదరాలు తేమను సంతరించుకుంటాయి. తాజాగానూ కనిపిస్తాయి.
 
* తరచూ లిప్‌స్టిక్ రాసుకునే వారు దాన్ని తొలగించిన వెంటనే కాస్త వెన్న రాసుకోవాలి. అలా చేయడం వల్ల అవి పొడిబారే సమస్య ఉండదు. 
 
* అరకప్పు పాలల్లో గుప్పెడు గులాబీ రేకులు గంటసేపు నానబెట్టి ఆ తర్వాత మిక్సీలో మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని పెదవులపై పూతలా వేయాలి. అరగంటయ్యాక కడిగేస్తే చాలు. పెదవులు పగిలి నెత్తురు వస్తుంటే ఈ చిట్కాను ట్రై చేయండి. దీనివల్ల నలుపు తగ్గడమే కాకుండా.. గులాబీ రేకుల్లాంటి పెదవులు మీ సొంతం అవుతాయి.