1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Amazon Extends Work From Home Policy Until January

అమేజాన్ కీలక నిర్ణయం.. జనవరి 8 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ పొడిగింపు

Amazon
ఈ-కామర్స్ దిగ్గజం అమేజాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సంక్షేమం కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని వచ్చే ఏడాది జనవరి 8 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ కార్యాలయాలన్నిటికీ ఈ నూతన విధానం వర్తిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. 
 
కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తున్న తరుణంలో అమేజాన్ ఈ నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 కారణంగా ఇంతకు ముందు మే నెలలో అక్టోబర్ 2 వరకు ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహించేందుకు అమేజాన్ అనుమతించిన సంగతి తెలిసిందే. 
 
అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు మరిన్ని పెరుగుతున్న కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని వచ్చే ఏడాది జనవరి 8వ తేదీ వరకు పొడిగించింది. అక్టోబర్ నాటికి పరిస్థితులు మరింత దిగజారేలా కనిపిస్తుండడంతో తాజాగా వర్క్‌ ఫ్రమ్ హోం గడువును పొడిగించినట్లు అమేజాన్ ఓ ప్రకటనలో తెలిపింది.
తర్వాతి కథనం
రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌‌తో రఘురామకృష్ణ రాజు మంతనాలు, పార్టీ మారడం కోసమేనా?