బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 16 జులై 2020 (19:24 IST)

రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌‌తో రఘురామకృష్ణ రాజు మంతనాలు, పార్టీ మారడం కోసమేనా?

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు... వైసీపీ నాయకులపైనే విమర్శలు చేయడం.. తను జగన్ వలన గెలవలేదని... తనని నమ్మే ఓట్లు వేసారని సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. తాజాగా రఘురామకృష్ణరాజు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని కలిసారు. ఇది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
 
అయితే... పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నందున సలహాలు, సూచనల కోసం రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశాను. రాజకీయాలు చర్చించలేదు అని ఆయన చెప్పారు. కేంద్ర బలగాలతో భద్రత కల్పించే అంశానికి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతుందని... రాష్ట్రమే భద్రత కల్పిస్తామని చెబుతున్నారు. ఏమి జరుగుతుందో వేచి చూడాలి.
 
తనకు, పార్టీకి మధ్య అగాధం సృష్టించేందుకు మీడియా ప్రయత్నిస్తుందని... తను ఎప్పుడూ పార్టీని పల్లెత్తుమాట అనలేదు. మా సంసారంలో నిప్పులు పోయాలని మీడియా చూస్తుంది అటూ మీడియాపై ఫైర్ అయ్యారు. బిజెపిలో చేరే అవకాశాలు లేవు, ఒక ఎంపిగా కేంద్ర మంత్రులను కలుస్తున్నాను. అంతేతప్ప పార్టీ మారే ఆలోచన లేదని స్పష్టం చేసారు. 
 
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పదవిని ఊడగొట్టాలని కొంతమంది చూస్తున్నారు. దానికి ఇంకా మూడు నెలల సమయం ఉంది. పార్టీకి, నాకు మధ్య ఎటువంటి విభేదాలు లేవు. పార్టీకి ఎటువంటి సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదు.
 
పార్టీ చాలా పటిష్టంగా ఉంది. పార్టీకి, పార్టీ అధ్యక్షుడికి సలహాలు సూచనలు ఇవ్వలేదు. ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశాను. తిరుపతి భూముల విషయం, ఇసుక విషయంలో సూచనలు చేశాను. ఇసుక కార్పొరేషన్ ఏర్పాటు అయిందంటే అక్కడ తప్పు జరుగుతోందని అర్థం. పార్టీలో భాద్యత గల కార్యకర్తగా, పార్టీకి ప్రజలు దూరం కాకూడదని, పార్టీ మరో 25 సంవత్సరాలు అధికారంలో ఉండాలన్న అభిప్రాయంతో నేను ప్రభుత్వానికి సూచనలు చేశాను. నాపై ఎందుకు అనర్హత ఫిర్యాదు చేశారో అర్థం కావడంలేదు. అనర్హత పిటిషన్లో కార్టూన్లు, జోకులు తప్ప ఏమీ లేవని ఆయన అన్నారు.