సంబంధిత వార్తలు
- శామ్సంగ్ నుంచి కొత్త మోడల్ గ్యాలెక్సీ ఎం47 5జీ.. ఫీచర్లు
- అమేజాన్ ప్రైమ్ డేకి 10 ఏళ్లు: రోజూవారీ అవసరాల్లో ఇష్టమైన కొత్త వాటిని కనుగొనండి
- జూన్ 26 నుంచి Nova 2 Pro, Nova 2 Neo స్మార్ట్ఫోన్ల విక్రయాలు, ధర ఎంతో తెలుసా?
- Nara Lokesh: మామ పై క్లాప్ కొట్టి NBK112 చిత్రం ప్రారంభించిన నారా లోకేష్
- ఇండియాకు నోవా వచ్చింది: NOVA2 NEO 5G, NOVA2 PRO 5G సిరీస్
ప్రైమ్ డే 2026 సేల్ తేదీలను ప్రకటించిన అమేజాన్
Amazon Prime Day 2026
భారత్‌లో ప్రైమ్ సేవలు ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సేల్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ సేవల్లో భాగంగా పలు స్మార్ట్ ఫోన్లపై అమెజాన్ ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. బ్యాంక్ ఆఫర్లతో కలిపి శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా సుమారు రూ. 84,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉండనుంది.
కొత్తగా విడుదలైన శాంసంగ్ గెలాక్సీ M47 5G ఫోన్‌ను రూ.22,999కి, వన్ ప్లస్ 13ను రూ.49,999కి విక్రయించనున్నారు. రెడ్ మీ, ఐకూ, రియల్మీ వంటి ఇతర ప్రముఖ బ్రాండ్ల ఫోన్లు కూడా ఆకర్షణీయమైన ధరలకే లభించనున్నాయి. ఇక ల్యాప్‌టాప్ విభాగంలో హెచ్పీ ఓమ్నీబుక్ సుమారు రూ. 68,990 ధరలో ఉండగా, డెల్ మోడళ్లు రూ.60,990 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంటాయి.
వీటితో పాటు శాంసంగ్, టీసీఎల్, ఎలీ, సోనీ వంటి అగ్రశ్రేణి బ్రాండ్ల స్మార్ట్ టీవీలపై గరిష్ఠంగా 75 శాతం వరకు తగ్గింపును ప్రకటించారు.
