సంబంధిత వార్తలు
కొండెక్కిన కోడిగుడ్ల ధరలు.. రూ.8 నుంచి రూ.9కి చేరింది.. చికెన్ ధరలు కూడా..?
కోడిగుడ్ల ధరలు కొండెక్కాయి. మార్కెట్‌లో కోడిగుడ్ల ధరలు పెరగడం సామాన్యుడికి తలపట్టుకునేలా చేసింది. రిటైల్ మార్కెట్లో ఒక్కో కోడిగుడ్డు ధర రికార్డు స్థాయిలో రూ. 8 నుండి రూ. 9కి చేరింది. సాధారణంగా శీతాకాలంలో మాత్రమే పెరిగే గుడ్డు ధరలు, ఈ విధంగా వర్షాకాలంలోనే భారీగా పెరగడం పట్ల వినియోగదారులు, వ్యాపార వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
కోడిగుడ్డు ధరలు ఈ రేంజ్‌లో పెరగడానికి పౌల్ట్రీ రంగంలో ఉత్పత్తి వ్యయం విపరీతంగా పెరిగిపోవడమే ప్రధాన కారణమని హైదరాబాద్‌కు చెందిన పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. కోళ్లకు పెట్టే ప్రధాన దాణా అయిన సోయాబీన్ ధర గత కొన్ని నెలల్లో కేజీ రూ.35 నుండి ఏకంగా రూ. 68కి పెరగ్గా, మొక్కజొన్న ధర కూడా క్వింటాళ్ల వారీగా రూ. 20 నుండి రూ.28కి పెరిగింది.
అలాగే కోడిగుడ్డు ధరల పెరుగుదల ప్రభావం చికెన్ ధరలపై కూడా పడింది. హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం కిలో లైవ్ చికెన్ ధర రూ. 290 నుండి స్కిన్‌లెస్ చికెన్ ధర రూ. 320 వరకు పలుకుతోంది.
