సంబంధిత వార్తలు
- అత్యంత విశ్వసనీయ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌గా నిలిచిన అమెజాన్: డేటమ్ ఇండెక్స్
- Gold price today: సరికొత్త ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేసిన పసిడి ధరలు
- ఇథనాల్ భవిష్యత్ ఇంధనం అని చెప్పినపుడు అందరూ ఫక్కున నవ్వారు : నితిన్ గడ్కరీ (వీడియో)
- అమెజాన్‌లో ఏడాదిలో రెండు రెట్లు పెరిగిన ద్విచక్ర వాహనాల విక్రయాలు
- యాపిల్ స్మార్ట్ ఫోన్ కొనుగోలుదార్లకు శుభవార్త
ఐసీఐసీఐ ప్రూ సిగ్నేచర్ సెక్యూర్: మెచ్యూరిటీ బెనిఫిట్, లైఫ్ కవర్, పన్ను ఆదా
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ఐసీఐసీఐ ప్రూ సిగ్నేచర్ సెక్యూర్(ICICI Pru Signature Secure) పేరిట సరికొత్త ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఇది భారతీయ జీవిత బీమా రంగంలోనే కచ్చితమైన మెచ్యూరిటీ ప్రయోజనం అంతర్గతంగా పొందుపర్చిన మొట్టమొదటి యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్(యులిప్) కావడం విశేషం.
ఐసీఐసీఐ ప్రూ సిగ్నేచర్ సెక్యూర్ అనేది ఒక నాన్-పార్టిసిపేటింగ్ లింక్డ్ ఇండివిడ్యువల్ సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. పన్ను ఆదాతో పాటు కచ్చితమైన ప్రయోజనాలను కోరుకునే కస్టమర్ల కోసం దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. ఈ ప్రొడక్ట్ ఒక సులువైన విధానాన్ని అందిస్తుంది. అదేంటంటే ఒక్కసారి పెట్టుబడి పెట్టండి, పాలసీ కాలపరిమితివ్యాప్తంగా లైఫ్ కవరేజీ ద్వారా రక్షణ పొందండి మరియు ఐదేళ్ల ముగిశాక మెచ్యూరిటీ ప్రయోజనాన్ని అందుకోండి. పాలసీ మెచ్యూరిటీ సమయంలో, కస్టమర్‌కు ఫండ్ వాల్యూ లేదా గ్యారెంటీడ్ మెచ్యూరిటీ బెనిఫిట్... ఈ రెండింటిలో ఏది ఎక్కువగా ఉంటే అది లభిస్తుంది. దీనివల్ల కస్టమర్లకు తమ పెట్టుబడిపై పూర్తి భరోసా ఉంటుంది.
ఉదాహరణకు, ఒకేసారి పెట్టుబడి పెట్టాలనుకునే 45 ఏళ్ల కస్టమర్, ఐసీఐసీఐ ప్రూ సిగ్నేచర్ సెక్యూర్‌లో రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టి, పాలసీ కాలపరిమితివ్యాప్తంగా జీవిత బీమా భద్రతను పొందవచ్చు. ఈ ప్లాన్ కింద కస్టమర్ రూ. 6.25 లక్షల లైఫ్ కవర్(సమ్ అష్యూర్డ్) ఎంచుకోవచ్చు. దీనికి గాను వారికి రూ. 7 లక్షల కచ్చితమైన మెచ్యూరిటీ ప్రయోజనం లభిస్తుంది.
సాధారణంగా గ్యారెంటీడ్ రిటర్న్స్ కోరుకునే కస్టమర్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లు(FDలు), బాండ్లు, ఇతర గ్యారెంటీడ్ రిటర్న్ ప్రొడక్ట్స్‌పై ఆధారపడుతుంటారు. అయితే, ప్రస్తుత రోజుల్లో కస్టమర్లు గ్యారెంటీడ్ రిటర్న్స్, ఆర్థిక రక్షణతో పాటు, పన్ను మినహాయింపుల తర్వాత కూడా మెరుగైన లాభాలను ఇచ్చే ప్లాన్‌ల కోసం ఎక్కువగా చూస్తున్నారు. కస్టమర్ల ఈ అవసరాన్ని తీర్చడానికే ఐసీఐసీఐ ప్రూ సిగ్నేచర్ సెక్యూర్‌ను తీసుకువచ్చాం. ఇది ఒకే ప్లాన్ కింద యులిప్ ప్రయోజనాలు, ఇన్-బిల్ట్ గ్యారెంటీడ్ మెచ్యూరిటీ బెనిఫిట్ మరియు లైఫ్ కవర్‌లను అందిస్తుంది.
కస్టమర్లు ఒకేసారి పెట్టుబడి పెట్టేందుకు ఈ ప్రొడక్ట్ వీలు కల్పిస్తుంది. అదే సమయంలో మరింత నమ్మకంతో తమ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలపై దృష్టి పెట్టేందుకు సహాయపడుతుంది. ఈ ప్లాన్ పాలసీ కాలపరిమితి అంతటా లైఫ్ కవర్‌ను కూడా అందిస్తుంది, తద్వారా కస్టమర్లు తమ కుటుంబ సభ్యుల ఆర్థిక భవిష్యత్తుకు భరోసా ఇవ్వవచ్చు అని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ Mr. వికాస్ గుప్తా పేర్కొన్నారు.
ముఖ్యంగా, ఈ ప్రొడక్ట్ ప్రారంభంలో చెల్లించిన ప్రీమియంపై 140 శాతం వరకు గ్యారెంటీడ్ మెచ్యూరిటీ బెనిఫిట్‌ను అందిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో, కస్టమర్లు ఫండ్ వాల్యూ లేదా గ్యారెంటీడ్ మెచ్యూరిటీ బెనిఫిట్... ఈ రెండింటిలో ఏది ఎక్కువగా ఉంటే దానిని పొందుతారు. దీనికి తోడు, ఈ ప్రొడక్ట్‌లో జీరో ప్రీమియం అలోకేషన్ ఛార్జీలు, జీరో పాలసీ అడ్మినిస్ట్రేషన్ ఛార్జీల సౌకర్యం ఉంది.
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎల్లప్పుడూ తన కస్టమర్లకు అత్యుత్తమ సేవలను అందించడానికి కట్టుబడి ఉంటుంది. ఈ సంస్థ 2026 ఆర్థిక సంవత్సరంలో 99.3% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోను సాధించింది. అలాగే సగటున 1.1 రోజుల్లోనే క్లెయిమ్‌లను పరిష్కరించింది. కస్టమర్లకు, వారి కుటుంబాలకు అత్యంత అవసరమైన సమయంలో అండగా నిలవడంలో కంపెనీకున్న నిబద్ధతకు ఇది నిదర్శనం.
గడిచిన 25 సంవత్సరాలుగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎన్నో తరాల కస్టమర్లకు సేవలందించే గౌరవాన్ని పొందింది. సాంకేతికత ఆధారంగా భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే సంస్థగా ఎదగడంపైనే కంపెనీ పూర్తి దృష్టి సారించింది. ఆలోచనాత్మకంగా మారుతూ, వేగంగా స్పందిస్తూ, ఇన్సూరెన్స్ పరిధిని మరింత విస్తరించడం ద్వారా అందరికీ దీర్ఘకాలిక ప్రయోజనాలను చేకూరుస్తూ మెరుగైన ప్రభావాన్ని చూపిస్తోంది.
తర్వాతి కథనం
