సంబంధిత వార్తలు
- ఐఆర్సీటీసీ మొబైల్ యాప్‌లో అత్యాధునిక ఫీచర్లు...
- దక్షిణాది పుణ్యక్షేత్రాలను రూ.7,140లతోనే చుట్టేయవచ్చు.. ఎలాగంటే?
- ప్రత్యేక రైళ్ళలో లిమిటెడ్ వెయిటింగ్ లిస్ట్ జాబితా - 22 నుంచి అమలు
- హాట్ కేకుల్లా స్పెషల్ ట్రైన్ టిక్కెట్లు.. జస్ట్ 20 నిమిషాల్లో ఖాళీ
- పరుగులు తీయనున్న రైళ్లు .. కేంద్రం పచ్చజెండా :: అమెరికా నుంచి 25 వేల మంది
రైల్వే ప్రయాణీకులకు శుభవార్త.. ఫుడ్ ఆన్ ట్రాక్ అనే యాప్ ఉపయోగిస్తే..?
రైల్వే ప్రయాణీకులకు శుభవార్త. ఇండియన్ రైల్వేస్ మళ్లీ ఇక్యాటరింగ్ సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో రైల్వే ప్రయాణికులు ట్రైన్‌లో వారికి నచ్చిన ఫుడ్‌ను ఆర్డర్ ఇవ్వొచ్చు.
ఫిబ్రవరి 1 నుంచే ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలోనే ఈ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. 250 ట్రైన్స్‌లో ప్రయాణికులు ఫుడ్ ఆర్డర్ ఇవ్వొచ్చు.
కాగా కరోనా వైరస్ నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్ గతంలో ఇక్యాటరింగ్ సర్వీసులను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇవి మళ్లీ ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమయ్యాయి. రైల్వే ప్రయాణికులు ట్రైన్‌లో ఫుడ్ ఆర్డర్ ఇవ్వాలని భావిస్తే.. ఫుడ్ ఆన్ ట్రాక్ అనే యాప్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.
ఈ యాప్ ద్వారా సులభంగా ఫుడ్ ఆర్డర్ ఇవ్వొచ్చు. మీరు గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్ వద్దనుకుంటే https://www.ecatering.irctc.co.in/ వెబ్‌సైట్ ద్వారా కూడా ఫుడ్ ఆర్డర్ ఇవ్వొచ్చు.
దేశవ్యాప్తంగా ఉన్న 500 రెస్టారెంట్ల ద్వారా ఫుడ్ డెలివరీ పొందొచ్చు. మీకు నచ్చిన ఫుడ్ పొందొచ్చు. దీని కోసం పీఎన్ఆర్ నెంబర్, ట్రైన్ పేరు, సీటు/బెర్త్ నెంబర్ వంటి వివరాలు అందించాల్సి ఉంటుంది. ట్రైన్ జర్నీ చేసే వారికి ఈ సర్వీసుల వల్ల ఊరట కలుగనుంది.
