పసిడి ప్రియులకు శుభవార్త.. రెండు రోజుల్లో రూ.3880 తగ్గుదల
దేశంలోని పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా తగ్గాయి. స్వచ్ఛమైన బంగారం ధర సుమారు రూ.3880 మేర క్షీణించడం గమనార్హం. ఈ ధరలు తగ్గుముఖం పట్టడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ పరిణామాలు, దేశీయంగా డిమాండ్ మదగించడం వంటి కారణాలతో పసిడి ధరలపై ఒత్తిడి కొనసాగుతోంది.
బుధవారం ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్ గణాంకాల ప్రకారం, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,48,790 వద్ద కొనసాగుతోంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,36,390గా ఉండగా, 18 క్యారెట్ల పసిడి ధర రూ. 1,11,590 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా పయనిస్తున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,39,990కి చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ బలపడటం, యూఎస్ ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ పెరగడం వంటి అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీనికి తోడు పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి, డిమాండ్ తగ్గడం వంటి పరిణామాలు కూడా ధరల తగ్గుదలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.
ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, తెలంగాణాలోని వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ వంటి ప్రధాన నగరాల్లోనూ ఇంచుమించు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ వంటి నగరాల్లో ధరలు స్వల్పంగా ఎక్కువగా నమోదయ్యాయి.
