శ్రావణ మాసం: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన కోడిగుడ్లు, చికెన్ ధరలు
Chicken Prices
ఉత్పత్తికి తగిన డిమాండ్ లేకపోవడం వల్ల రాబోయే రోజుల్లో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
నెల రోజుల క్రితం కిలో చికెన్ ధర రూ.320 నుండి రూ.340 వరకు పలకగా, ప్రస్తుతం చిల్లర వర్తకులు రూ.260 నుండి రూ.270 మధ్య విక్రయిస్తున్నారు. నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (ఎన్ఈసీసీ) ప్రకారం హోల్‌సేల్ ధర ఒక్కో గుడ్డుకు రూ.5.45గా ఉండగా, రిటైల్‌గా రూ.6.00 నుండి రూ.6.50కి లభిస్తోంది.
గతంలో ఒక్కో గుడ్డు ధర రూ.8 నుండి రూ.9 వరకు ఉండేది. ప్రాథమిక గణాంకాల నివేదిక ప్రకారం, దేశవ్యాప్తంగా గుడ్ల ఉత్పత్తి, తలసరి వినియోగంలో రెండు తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానాల్లో కొనసాగుతున్నాయి. దేశంలో ఆంధ్రప్రదేశ్ 18.37శాతం వాటాతో మొదటి స్థానంలో ఉండగా, తమిళనాడు (15.63శాతం) రెండవ స్థానంలో, తెలంగాణ (12.98శాతం) మూడవ స్థానంలో నిలిచాయి.
