సంబంధిత వార్తలు
- రూ.700ల కరెన్సీ నోటును ప్రవేశపెట్టనున్న ఆర్బీఐ? ప్లాస్టిక్ కరెన్సీ కూడా?
- శ్రీకాళహస్తిలో పంచాయతీలకు ఈవీ చెత్త సేకరణ వాహనాలు, ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన హెచ్‌సీసీబీ
- సిలిండర్ ధరను పెంచిన ఆయిల్ కంపెనీలు.. ఎంత పెంచారంటే...
- జెమిని అనుభవాలతో కోక్ బ్రేక్‌కు కొత్త అనుభూతిని అందిస్తున్న కోకాకోలా, గూగుల్
- ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ భారత సైన్యం, పారామిలిటరీ దళాలతో అవగాహన ఒప్పందం
స్మాల్ క్యాప్‌లలో మళ్లీ అవకాశాలు: బజాజ్ ఫిన్‌సర్వ్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఎఎంసి అధ్యయనం
బజాజ్ ఫిన్‌సర్వ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం, స్మాల్ క్యాప్ షేర్లలో పెట్టుబడులకు మళ్లీ అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలుస్తోంది. మెరుగైన ఫండమెంటల్స్, లాభాల్లో పునరుద్ధరణ అవకాశాలు, సరిచేసుకున్న విలువలు, గతంలో కనిపించిన బలమైన రికవరీ ధోరణులు దీనికి మద్దతు ఇస్తున్నాయి.
ఈ అధ్యయనం స్మాల్ క్యాప్‌లలో పెట్టుబడులకు క్రమశిక్షణాత్మక దృక్పథాన్ని సూచిస్తోంది. బలమైన ఆర్థిక స్థితి, స్థిరమైన లాభదాయకత, దీర్ఘకాలిక పోటీ సామర్థ్యం ఉన్న కంపెనీలను గుర్తించడం దీనిలో ప్రధాన లక్ష్యం. అదే సమయంలో, బలమైన వ్యాపార నమూనాలు, భవిష్యత్ విస్తరణ అవకాశాలున్న సంస్థల ద్వారా వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడంపైనా దృష్టి పెట్టింది.
ఆర్థిక సంవత్సరం 2026లో ఫండమెంటల్స్ మెరుగుదల
గత కొన్ని సంవత్సరాల్లో స్మాల్ క్యాప్ విభాగంలో గణనీయమైన నిర్మాణాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. కంపెనీలు విస్తరణ కోసం అప్పుల కంటే అంతర్గత నగదు ప్రవాహాలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. దీంతో బ్యాలెన్స్ షీట్లు మరింత బలపడటంతో పాటు లాభదాయకత సూచికలు కూడా మెరుగుపడ్డాయి. నాణ్య ఆర్థిక సంవత్సరాలు 2018-19 నుంచి 2021-22 మధ్య సుమారు ₹2.2 ట్రిలియన్‌గా ఉన్న మొత్తం క్యాపెక్స్, 2022-23 నుంచి 2025-26 మధ్య దాదాపు ₹3.4 ట్రిలియన్‌కు పెరిగింది. అదేసమయంలో నెట్ డెట్-టు-ఈక్విటీ స్థాయులు ఆర్థిక సంవత్సరం 2018-19లో లోని 0.52x నుంచి ఆర్థిక సంవత్సరం 2025-26లో నాటికి దాదాపు శూన్య స్థాయికి తగ్గాయి. రిటర్న్ ఆన్ ఈక్విటీ(ROE) కూడా 9% నుంచి 12%కి పెరగడం కంపెనీల ఆర్థిక క్రమశిక్షణను, స్థిరమైన వ్యాపార నమూనాలను ప్రతిబింబిస్తోంది.
డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు(DIIs) కూడా SIPల ద్వారా స్మాల్ క్యాప్ విభాగంలో తమ పెట్టుబడులను క్రమంగా పెంచుతున్నారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP) ఆధారిత ప్రవాహాలు సాధారణంగా దీర్ఘకాలికంగా, స్థిరంగా ఉండటంతో, భవిష్యత్తులో స్మాల్ క్యాప్ మార్కెట్లో ఒడిదుడుకులను తగ్గించడంలో ఇవి సహాయపడవచ్చని అధ్యయనం పేర్కొంది. మరోవైపు, రిటైల్ పెట్టుబడిదారుల వాటాలో స్వల్ప తగ్గుదల కనిపించడం అధిక ఊహాగానాలను తగ్గించవచ్చని సూచించింది.
మార్కెట్ కరెక్షన్‌తో ఏర్పడిన అవకాశాలు
ఆస్తి నిర్వహణ సంస్థ ప్రకారం, ఇటీవలి మార్కెట్ కరెక్షన్ కారణంగా స్మాల్ క్యాప్ విభాగంలో విలువైన పెట్టుబడి అవకాశాలు వెలుగుచూస్తున్నాయి. ప్రస్తుతం దాదాపు 50% స్మాల్ క్యాప్ షేర్లు తమ 10 ఏళ్ల సగటు విలువల కంటే తక్కువ స్థాయిలో ట్రేడవుతున్నాయి. ఇది గత కొన్ని సంవత్సరాల్లో అత్యధిక స్థాయిల్లో ఒకటిగా పేర్కొంది. విస్తృత మార్కెట్ కరెక్షన్ కారణంగా అధిక విలువల ఒత్తిడి తగ్గి, బలమైన ఫండమెంటల్స్ ఉన్న కంపెనీల్లో ఎంపిక చేసిన పెట్టుబడులకు అవకాశాలు ఏర్పడ్డాయని అధ్యయనం తెలిపింది.
అలాగే, గతంలో మార్కెట్ పతనాల తర్వాత రికవరీ దశల్లో స్మాల్ క్యాప్‌లు మెరుగైన ప్రదర్శన కనబరిచినట్టు ఆస్తి నిర్వహణ సంస్థ గుర్తుచేసింది. మార్చి 2020 నుంచి జనవరి 2022 వరకు జరిగిన పోస్ట్-కోవిడ్ రికవరీ సమయంలో నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 247% పెరిగింది. ఇదే సమయంలో నిఫ్టీ 50 మాత్రం 138% మాత్రమే పెరిగింది. ఇది దీర్ఘకాలిక మార్కెట్ చక్రాల్లో స్మాల్ క్యాప్ విభాగం వేగవంతమైన రికవరీ సామర్థ్యాన్ని సూచిస్తోంది.
