బడ్జెట్-2021: Union Budget Mobile App విడుదల..
Union Budget Mobile App
ఇటీవల హల్వా వేడుక సందర్భంగా Union Budget Mobile Appను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేశారు. నేషనల్ ఇన్‌ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) దీన్ని రూపొందించింది. ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత ఈ యాప్‌లో బడ్జెట్ పత్రాలు అందుబాటులోకి వస్తాయి.
* బడ్జెట్‌కు సంబంధించి ఆర్థిక మంత్రి ప్రసంగం, వార్షిక ఆర్థిక నివేదిక, ఆర్థిక బిల్లు.. ఇలా 14 రకాల బడ్జెట్ పత్రాలను ఈ యాప్‌లో పొందొచ్చు.
* హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ పత్రాలు అందుబాటులో ఉంటాయి.
* మొబైల్‌లో బడ్జెట్ పత్రాలను వీక్షించడమే కాక.. డౌన్‌లోడ్ చేసుకునే వీలూ ఉంది. పత్రాలను ప్రింట్ చేసుకోవచ్చు కూడా.
* జూమ్ ఇన్, జూమ్ ఔట్ ఫీచర్ల ద్వారా సులువుగా చదువుకోవచ్చు. బడ్జెట్‌లో మనకు కావాల్సిన సమాచారం కోసం సెర్చ్ చేసే వెసులుబాటూ కల్పించారు.
* బడ్జెట్‌లో భాగంగా ఉదహరించిన ఇతర లింకులనూ యాక్సెస్ చేయొచ్చు.
