గద్వాల జిల్లాలో 73 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Anganwadi Teacher
అర్హులైన మహిళా అభ్యర్థులు జూలై 8వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పత్రాల పరిశీలన 2026 జూలై 8 నుండి 2026 జూలై 17 వరకు జరుగుతుంది.
వయోపరిమితి: 01.07.2026 నాటికి 18 నుండి 35 ఏళ్లు.
అర్హత: అంగన్‌వాడీ టీచర్ (AWT) పోస్టుకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత
హెల్పర్ (AWH) పోస్టుకు 10వ తరగతి ఉత్తీర్ణత.
దరఖాస్తు రుసుము ఏమీ లేదు. సంబంధిత ప్రాంతాలకు (హ్యాబిటేషన్లకు) చెందిన అర్హులైన మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్ wdcw.tg.nic.inలో అందుబాటులో ఉన్నాయి.
