1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
  4. DOST Registration date extended in Telangana once again

డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం 'దోస్త్' గడువు పొడగింపు

DOST Registration date
తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో విద్యార్థుల ఆన్‌లైన్ అడ్మిషన్లకు సంబంధించి రూపొందించిన ‘దోస్త్’ పోర్టల్ మొదటి విడత రిజిస్ట్రేషన్ గడువు శనివారంతో ముగిసింది. అయినప్పటికీ పూర్తిస్థాయిలో విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోవడంతో గడువును మరోమారు పొడిగించారు. రిజిస్ట్రేషన్ల గడువును ఈ నెల 28 వరకు పొడిగించినట్టు దోస్త్ కన్వీనర్ ఆచార్య ఆర్. లింబాద్రి తెలిపారు.
 
రాష్ట్ర వ్యాప్తంగా శనివారం వరకు 1.88 లక్షల మంది విద్యార్థులు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వచ్చే నెల 4న తొలి విడత సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆ తర్వాతి రోజు నుంచి 9 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రెండో విడత రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఆగస్టు 5 నుంచి 18 వరకు జరుగుతుంది. అదే నెల 25న రెండో విడత సీట్లను కేటాయిస్తారు.
తర్వాతి కథనం
బోనమెత్తిన మంత్రి తలసాని : ఉజ్జయిని మహంకాళి ఉత్సవాలు ప్రారంభం