గురువారం, 30 నవంబరు 2023
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 జులై 2021 (08:24 IST)

నేటి బంగారం ధరలు : స్వల్పంగా తగ్గిన వెండి ధర

దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బులిటెన్ మేరకు బంగారం ధర తటస్థంగా ఉండే, వెండి ధర మాత్రం తగ్గింది. కిలో వెండి రూ.350 మేర తగ్గింది. ఆదివారం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు వివరాలను పరిశీలిస్తే, 
 
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 గా ఉంది. కిలో వెండి ధర రూ.67,050 లుగా ఉంది.
 
అలాగే, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,870 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,870 ఉంది. అయితే.. కిలో వెండి ధర రూ.67,050 లుగా ఉంది.
 
ఇకపోతే, హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,770 ఉంది. అయితే.. కిలో వెండి ధర రూ.72,000 లుగా కొనసాగుతోంది.
 
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,770 గా ఉంది. వెండి ధర రూ.72,000 లుగా ఉంది.