శనివారం, 14 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By జెఎస్కె
Last Modified: శనివారం, 24 జులై 2021 (12:26 IST)

ఒలింపిక్స్‌లో భార‌త్ బోణీ, మీరాబాయికి సిల్వ‌ర్

భార‌తీయుల‌కు తొలి తీపి క‌బురునిచ్చింది ఒలంపిక్స్. ఒలింపిక్స్ లో భార‌త్ క్రీడాకారిణి మీరాబాయి బోణీ కొట్టింది. టోక్యో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న ఒలంపిక్స్ లో భారత్ కు తొలి పతకం ల‌భించింది.

వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను సిల్వర్ మెడల్ సాధించింది. మహిళల 49 కిలోల వెయిట్లిఫ్టింగ్ విభాగం మెడల్ ద‌క్కించుకుంది మీరాబాయి. ఆమె క‌చ్చితంగా మెడ‌ల్ సాధిస్తుంద‌ని భార‌తీయులు అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మీరాభాయి చాను సిల్వ‌ర్ మెడ‌ల్ తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. భార‌త్ తొలి బోణీ కొట్ట‌డంతో ఒలంపిక్ గేమ్స్ చూస్తున్న క్రీడాప్రియులు ఎంతో ఆనందోత్సాహాలు జ‌రుపుకొంటున్నారు.