సంబంధిత వార్తలు
- జియో ఫోన్ ప్లీజ్... బుక్ చేసుకున్న 40,00,000 మంది... మీ ఫోన్ ఇలా రెడీ...
- ఆన్లైన్లో జియో 4జీ ఫీచర్ ఫోన్‌ను ఇలా బుక్ చేసుకోండి...
- నేటి నుంచి జియో 4జీ ఫీచర్ ఫోన్స్ బుకింగ్స్ స్టార్ట్
- నంద్యాల బైపోల్ ప్రచారానికి తెర : దొరికిన డబ్బు రూ.కోటిన్నర, పంచింది రూ.60 కోట్లు!
- వామ్మో... మేము లేవలేం నాయనోయ్... జియో దెబ్బకు వొడాఫోన్ ఉత్తరం...
దసరా నుంచి జియో ఫీచర్ ఫోన్లు పంపిణీ...
రిలయన్స్ జియో ఉచితంగా అందజేయనున్న ఫీచర్ ఫోన్ల పంపిణీకి దసరా నవరాత్రుల సందర్భంగా శ్రీకారం చుట్టనున్నారు. గత నెలలో ఈ ఫోన్ల బుకింగ్ ప్రారంభం కాగా, సెప్టెంబర్ చివరి వారంలో పంపణీ చేస్తామని ప్రకటించిన విషయం
రిలయన్స్ జియో ఉచితంగా అందజేయనున్న ఫీచర్ ఫోన్ల పంపిణీకి దసరా నవరాత్రుల సందర్భంగా శ్రీకారం చుట్టనున్నారు. గత నెలలో ఈ ఫోన్ల బుకింగ్ ప్రారంభం కాగా, సెప్టెంబర్ చివరి వారంలో పంపణీ చేస్తామని ప్రకటించిన విషయం తెల్సిందే.
ముఖ్యంగా, వినియోగదారుల సంఖ్య పెంచుకునేందుకు.. 2018 డిసెంబరు నాటికి 4జీ అనుసంధానం కలిగిన 20 కోట్ల జియో ఫోన్లను జియో విక్రయించనుంది. ఇందులోభాగంగా, దసరా నవరాత్రుల సందర్భంగా వినియోగదారులకు జియో ఫోన్ల పంపిణీని ప్రారంభించనుంది.
అదేసమయంలో వచ్చే యేడాది ముగిసేనాటికి ఈ ఫోన్ల ద్వారా చందాదారుల సంఖ్య 40 కోట్లకు చేరొచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. గత జూన్‌కి జియోకు 12.34 కోట్ల మంది వినియోగదారులు ఉన్న విషయం తెల్సిందే. కాగా, కొత్త జియో ఫోన్‌కు 60 లక్షల రిజిస్ట్రేషన్‌లు రావడంతో.. తాత్కాలికంగా బుకింగ్స్‌ను నిలిపివేసిన విషయం తెలిసిందే.
