1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
  4. NIE Chennai Recruitment 2023, 47 Technical Assistant & Other Posts

చెన్నై ఐసీఎంఆర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ ఉద్యోగాలు

Jobs
ఎన్.ఐ.ఈ చెన్నైలోని ఐసీఎంఆర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీలో రెగ్యులర్ ప్రాతిపదికన 47 ఉద్యోగ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులన్నీ రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఇందులో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 33 ఉన్నాయి. వీటిలో బయోస్టాటిస్టిక్స్, నెట్ వర్కింగ్, ప్రోగ్రామర్, లేబోరేటరీ, రీసెర్చ్ మేనేజ్‌మెంట్, కమ్యూనికేషన్, సోషల్ సైన్స్, పబ్లిక్ హెల్త్, ఫీల్డ్ యాక్టివిటీస్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కేటగిరీలు ఉన్నాయి. అలాగే, ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులు 14 ఉండగా, ఈ విభాగంలో ల్యాబొరేటరీ, ఎయిర్ కండిషనింగ్, ప్లంబర్, జనరల్ కేటగిరీలో ఉన్నాయి. 
 
ఈ పోస్టులను అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వేతన స్కేలు టెక్నికల్ అసిస్టెంట్‌కు నెలకు ₹.35400 నుంచి ₹.1,12,400గా ఇస్తారు. ల్యాబొరేటరీ అటెండెంట్‌కు రూ.1800 నుంచి రూ.56900 వరకు చెల్లిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు దరఖాస్తు రుసుం కింద రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. రాత పరీక్ష తదితరాల ఆధారంగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఎన్ఎస్ఐఈ అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. 
About Writer
వరుణ్
తర్వాతి కథనం
దేశంలో మినీ సమరం.. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఎపుడంటే