1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 అక్టోబరు 2023 (19:19 IST)

నిరుద్యోగులకు ఓ శుభవార్త- ఇస్రోలో 435 అప్రెంటీస్​ పోస్టులు

నిరుద్యోగులకు ఓ శుభవార్త. వచ్చే 25 ఏళ్లలోగా అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్‌ను నిర్మించేందుకు ప్లానింగ్‌ను రెడీ చేస్తున్నట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ గతంలో ప్రకటించారు.  
 
దీర్ఘకాలిక ఈ స్పేస్ క్రాఫ్ట్‌ ద్వారా భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందనే కోణంలో ప్రస్తుతం స్టడీ చేస్తున్నట్లు తెలిపారు. అన్నీ కలిసొస్తే రాబోయే 20-25 ఏళ్ల లోగా ఇస్రో సొంతంగా స్పేస్ స్టేషన్ నిర్మిస్తుందని సోమనాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
తాజాగా ఇంజినీరింగ్ అర్హతతో.. ఇస్రోలో 435 అప్రెంటీస్​ పోస్టులను భర్తీ చేయనుంది. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులు 273, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులు 162 వున్నాయి. 
 
టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులకు ఇంజినీరింగ్ డిప్రొమా ఉత్తీర్ణత సాధించాల్సి వుంటుంది. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు అప్లై చేసిన అభ్యర్థుల వయస్సు 28 ఏళ్లు లోపు వుండాలి. టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల దరఖాస్తు చేసిన అభ్యర్థుల వయస్సు 30 ఏళ్ల లోపు వుండాలి.