ఇస్రో చీఫ్ సోమనాథ్ నెల జీతం అంతేనా? నెట్టింట రచ్చ రచ్చ
సోషల్ మీడియాలో ఇస్రో చీఫ్ సోమనాథ్ జీతం గురించి ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష గోయెంకా ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అందులో సోమనాథ్ నెల 2.5 లక్షల రూపాయల జీతం పొందుతున్నారు. ఆయన అంకితభావానికి తాను తలవంచుతున్నానని పేర్కొన్నారు.
ఇంక తన ఎక్స్ పేజీలో గోయెంకా ''సోమనాథుని నెల జీతం 2.5 లక్షల రూపాయలు. ఇది సరైన లేదా న్యాయమా? అంటూ ప్రశ్నించారు. సోమనాథ్ వంటి వారు సైన్స్, పరిశోధనల పట్ల ఆసక్తి కనబరచడం, కృషి చేయడం, తమ దేశానికి గర్వకారణం, తమ దేశాన్ని భాగస్వామ్యం చేయడం, తమ లక్ష్యాన్ని సాధించడం వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఆయనలాంటి వ్యక్తులకు తలవంచి నమస్కరిస్తున్నాను'' అని పేర్కొన్నారు.
తాము కోరుకున్న రంగంలో ఉన్నత స్థానానికి చేరుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తారని.. ఇందుకు ఇస్రో ఛైర్మన్ సోమ్ నాథే నిదర్శనమని హర్ష గోయెంకా ప్రశంసించారు. డబ్బు సంపాదన కంటే.. ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే తపనతో ఇస్రోకు సోమ్‌నాథ్ ఛైర్మన్ అయ్యారని చెప్పారు. ఇస్రో ఛైర్మన్‌కు రెండు లక్షల రూపాయల పైచిలుకు జీతం ఇవ్వడం న్యాయమా కాదా అనే విషయాన్ని పక్కనబెడితే.. సైన్స్ రంగంపై ఆయనకు వున్న మక్కువను గుర్తించాలన్నారు.
ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇస్రోలో జీతం తక్కువా? అంటూ ఈ విషయం వివాదాంశంగా మారిన స్థితిలో, సోమనాథ్ ఇంత తక్కువ జీతం తీసుకుంటున్నారా.. ఇలా ఎందరో దేశం కోసం కృషి చేస్తూ.. తక్కువ మొత్తానికి పనిచేస్తున్నారంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.