గురువారం, 12 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 13 సెప్టెంబరు 2023 (11:31 IST)

వాయిదాపడిన ప్రభాస్ "సలార్" విడుదల

salar
టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ ప్రభాస్ హీరోగా 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చిత్రం సలార్. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ప్రభాస్‌ను ఆయన మాస్ యాక్షన్ హీరోగా ఈ బొగ్గు గనుల నేపథ్యంలో ఈ కథను నడిపిస్తూ ఈ సినిమాలో చూపిస్తున్నారు. 
 
ఈ సినిమా నుంచి ఇంతవరకూ చాలా తక్కువ అప్‌డేట్స్ వచ్చాయి. అయినా అంచనాలు ఒక రేంజ్‌లో ఉన్నాయి. ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా ఇంతకుముందే ప్రకటించారు.
 
అయితే ఆ రోజున థియేటర్లకు ఈ సినిమా రావడం లేదు. కొన్ని కారణాల వలన ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్టుగా మేకర్స్ బుధవారం ప్రకటించారు. క్వాలిటీ విషయంలో రాజీలేకుండా ఈ సినిమాను అందించే ప్రయత్నంలో ఆలస్యం అవుతోందనీ, అర్థం చేసుకోవాలని ఈ ప్రకటన ద్వారా తెలియజేశారు. 
 
కొత్త విడుదల తేదీ ఎప్పుడు అనేది ఈ నెల 28లోగా తెలియజేయనున్నారు. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు కీలకమైన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే.