గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 సెప్టెంబరు 2023 (10:41 IST)

రాజకీయాల్లోకి రానున్న సమంత? ఆ పార్టీలో కీలక పదవి?

Samantha Ruth Prabhu
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రాజకీయాల్లోకి రానుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అలాగే సోషల్ మీడియాలోనూ ట్రెండ్ అవుతోంది. తెలంగాణ ప్రజలకు సమంత అంటే అభిమానం ఎక్కువ. ఆమె రైతన్నలకు మద్దతుగా ఇప్పటికే చాలా కార్యక్రమాల్లో పాల్గొంది. 
 
అలాగే తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గాను ఆమె కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సమంతను బీఆర్ఎస్ ఆహ్వానించి.. స్టార్ క్యాంపెయిన్‌గా ప్రచారం చేయిస్తే పార్టీకి కలిసి వస్తుందని భావిస్తున్నారని తెలుస్తోంది. ఇందులో ఎంత నిజముందో లేదో తెలియదు కానీ బీఆర్ఎస్ అధిష్టానం సామ్‌తో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. 
 
ఈ విషయంపై సమంత ఫ్యాన్స్ స్పందించారు. ఆమెకు రాజకీయాల్లోకి రావడం అస్సలు ఇష్టం లేదు. ఇప్పటికే అనారోగ్య సమస్యల వల్ల బాధపడుతుంది. ఇలాంటి పుకార్లు తీసుకురావద్దని కొందరు.. దీనిపై క్లారిటీ రావాలంటే సమంతనే స్వయంగా స్పందించాల్సి వుందని సినీ జనం అంటున్నారు.