శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 అక్టోబరు 2023 (13:59 IST)

తెలంగాణ కానిస్టేబుల్స్ పోస్టుల తుది ఫలితాలు విడుదల

telangana police
తెలంగాణ కానిస్టేబుల్స్ పోస్టుల తుది ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాలను టీఎస్ఆర్ఎల్‌బి వెబ్‌సైట్‌లోని వ్యక్తిగత లాగిన్‌లలో పొందుపరిచారు. 
 
పోలీసు, ఎస్పీఎఫ్, అగ్నిమాపక, జైళ్లు, రవాణా, అబ్కారీ శాఖలకు సంబంధించి మొత్తం 16,604 పోస్టులకు గాను 15,750 పోస్టులకు ఫలితాలను విడుదల చేశారు. 
 
ఇందులో 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళా అభ్యర్థులు ఎంపికయ్యారు. పోస్టులకు ఎంపికైన వారి ఫైనల్ లిస్ట్‌ను టీఎస్ఎల్పీఆర్బీ విడుదల చేసింది. 
 
అలాగే, అభ్యర్థుల కటాఫ్, ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. హై కోర్టులో కేసు ఉండటంతో కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టుల ఫలితాలు వాయిదా పడ్డాయి.
 
ఈ నెల 5న ఉదయం 8 గంటల నుంచి 7న సాయంత్రం 5 గంటల వరకు వెబ్ సైట్‌లో వ్యక్తిగత లాగిన్ ఐడీ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.