మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2023 (14:05 IST)

దేశంలో మినీ సమరం.. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఎపుడంటే

states election
దేశంలో వచ్చే యేడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందు మినీ సమరంగా భావించే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. భారత ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ ఐదు రాష్ట్రాలకు పోలింగ్ తేదీలు వేర్వేరుగా ఉన్నప్పటికీ ఓట్ల లెక్కింపు, ఫలితాలు మాత్రం డిసెంబరు మూడో తేదీన వెల్లడిస్తారు. నవంబరు 7వ తేదీ నుంచి నవంబరు 30వ తేదీ వరకు పోలింగ్ వివిధ దశల్లో నిర్వహిస్తారు. ఆ ప్రకారంగా ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీలను పరిశీలిస్తే, 
 
230 సీట్లు కలిగిన మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీతో పాటు 90 సీట్లు కలిగిన మిజోరంకు నవంబరు ఏడో తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు. 200 సీట్లున్న రాజస్థాన్ అసెంబ్లీకి నవంబరు 23న, 119 సీట్లున్న తెలంగాణాకు నవంబరు 30వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. అయితే, మావోయిస్టు ప్రభావిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌కు మాత్రం రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 90 సీట్లు ఈ రాష్ట్రంలో తొలి దశ పోలింగ్ నవంబర్ 7వ తేదీన రెండో దశ పోలింగ్ నవంబర్ 17వ తేదీన నిర్వహించనున్నారు. ఈ ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు, ఫలితాలు మాత్రం డిసెంబరు మూడో తేదీన వెల్లడిస్తారు.