తగినంత వేడిగా మాత్రమే...!
చిన్నపిల్లలకు వేడినీళ్లతో స్నానం చేయించేటప్పుడు.. ముందుగా వేడినీళ్ల ఉష్ణోగ్రతను పరీక్షించి, పిల్లలు తట్టుకోగలిగేంత వేడి ఉందని నిర్ధారించుకున్న తరువాతే వారికి స్నానం చేయించటం మంచిది. ఇలా చేసినట్లయితే చిన్నారులకు సహజంగా ఉండే సున్నితమైన చర్మాన్ని కాలిన గాయాల బారి నుండి రక్షించిన వారమవుతాము.

