పిస్తా మిల్క్ షేక్
|
చిక్కటి మీగడ పాలు... ఒక లీటరు
పంచదార పొడి... 8 టీ స్పూన్లు
పిస్తా పేస్టు... 50 గ్రా
పిస్తా కోవా... ఒక టేబుల్ స్పూను
ఐస్ క్యూబ్స్... 6
యాలకుల పొడి... పావు టీస్పూను
ఉప్పు... చిటికెడు
తయారీ విధానం :
ముందుగా పాలను కాచి చల్లార్చాలి. మిక్సీ జ్యూస్ జార్లో పాలు, పంచదార, పిస్తా పేస్టు, పిస్తా కోవా యాలకుల పొడి, ఉప్పు, ఐస్ క్యూబ్స్ వేసి బాగా తిప్పాలి. కమ్మటి సువాసనలతో నురగలు కక్కుతూ పిస్తా మిల్క్ షేక్ రెడీ అవుతుంది. తరువాత ఆ మిశ్రమాన్ని గాజు గ్లాసుల్లో పోసి పైన ఐస్ క్యూబ్స్ వేసి, సర్వ్ చేస్తే... ఆకర్షణీయమైన రంగుతో నోరూరిస్తుంది.

