1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చైనీస్

బ్రెడ్‌ ముక్కలతో పిజ్జా

వంటకాలు చైనీస్ బ్రెడ్ స్లైసులు ఉప్మారవ్వ పాలు టమోటో పచ్చిమిర్చి ఉల్లిపాయ క్యారెట్ తురుము కాప్సికం కొత్తిమీర చిల్లీసాస్
FileFILE
కావలసిన పదార్థాలు :
బ్రెడ్ స్లైసు‍లు... కావలసినన్ని
ఉప్మా రవ్వ... ఒక కప్పు
పాలు... 1/2 కప్పు
టొమాటో... ఒకటి
పచ్చిమిర్చి... రెండు
ఉల్లిపాయ... ఒకటి
క్యారెట్ తురుము... ఒక టేబుల్‌ స్పూన్
కాప్సికం... ఒక టేబుల్‌ స్పూన్
కొత్తిమిర... రెండు టేబుల్‌ స్పూన్
టోమాటో సాస్... ఒక టీస్పూన్
చిల్లీ సాస్... మూడు టేబుల్‌ స్పూన్
చీజ్... 50 గ్రాములు
నూనె... ఐదు టేబుల్‌ స్పూన్
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
బ్రెడ్ పిజ్జా తయారీకి కావలసిన పదార్థాలన్నింటిలో చీజ్, చిల్లీసాస్ తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ కలుపుకోవాలి. ఒక్కో బ్రెడ్ స్లైసుపై చిల్లీ సాస్ పూసి పైన అన్ని పదార్థాలతో కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని రెండు స్పూన్లు వేసి బ్రెడ్ మొత్తానికి సమానంగా పూయాలి. తరువాత తురిమిన చీజ్ చల్లి పెనంపై కొద్దిగా నూనె లేదా వెన్న వేసి రెండు వైపులా కాల్చాలి. అంతే వేడి వేడి బ్రెడ్ పీసులతో తయారైన పిజ్జా సిద్ధమైనట్లే...!
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి