1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చైనీస్

స్యాండ్ విచ్

బాణలి నూనె మిర్చి అల్లం ఉల్లి  క్యాప్సికమ్
కావలసిన పదార్థాలు:
బ్రెడ్: రెండు
నూనె: వేపుడుకు తగినంత

మసాలా తయారీకి...
బంగాళాదుంపలు: పావు కిలో
బఠాణీ: అరకప్పు
క్యారెట్, కాలీఫ్లవర్, బీన్స్ తరుగు: రెండు కప్పులు
అల్లం, మిర్చి పేస్ట్: రెండు టేబుల్ స్పూన్లు
గరంమసాలా: 1 చెంచా
నిమ్మకాయ: ఒకటి
ఉప్పు, పసుపు: సరిపడ

తయారీ విధానం:
బాణలిలో నూనెను పోసి మరిగించి అందులో మిర్చి, అల్లం, ఉల్లి, క్యాప్సికమ్ ముక్కలను వేసి బాగా వేయించాలి. ఉడికించిన వెజిటేబుల్స్‌ను అందులో చేర్చి నీరు ఇరిగి పోయేంతవరకు వేపాలి. వేగిన పదార్థానికి ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసి బాగా కలిపి నిమ్మరసం పోసి కొత్తిమీర చల్లి కలిపి దింపాలి. రెండు బ్రెడ్‌ ముక్కలు తీసుకుని నీటిలో ముంచి వెంటనే తీసి వాటి మధ్య మిశ్రమాన్ని పెట్టి అంచులు సీలి చేసి బ్రెడ్‌కి ఇరువైపులా కొంచెం రవ్వ చల్లి అప్పడాల కర్రతో సన్నగా వత్తి వాటిని వేడి నూనెలో వేపి బ్రౌన్ కలర్ వచ్చాక నూనె నుంచి తీసి సర్వ్ చేయాలి. ఈ స్యాండ్‌విచ్‌కు సాస్‌ను సైడిష్‌గా వాడుకుంటే మంచి టేస్ట్‌నిస్తుంది.
About Writer
Selvi