స్వస్‌రోల్ కేక్
|
మైదాపిండి... 80గ్రాములు
కోడిగుడ్లు... మూడు
బేకింగ్ పౌడర్... పావు చెంచా
వేడినీరు... ఒక
వెనిల్లా ఎసెన్స్... కాసిన్ని చుక్కలు
చక్కెర... 85 గ్రాములు
జామ్... 55 గ్రాములు
తయారీ విధానం :
మైదాపిండిని, బేకింగ్ పౌడర్‌ను జల్లెడలో జల్లించుకుని, రెండింటిని కలిపి వేడినీరు పోసి ముద్దలా చేసుకోవాలి. కోడిగుడ్డు సొనను తీసుకుని బాగా కలియబెట్టాలి. ఇందులో పంచదార వేసి బాగా కరిగేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో పోసి నీరు మరుగుతున్న పాత్రలో ఉంచాలి, ఆవిరి వల్ల కోడిగుడ్డు సొన వేడెక్కి, సొనంతా చిక్కగా అయి గట్టిపడినట్లవుతుంది. దీనిని చెంచాతో కలిపి క్రీమ్‌లా చేయాలి.
ఈ క్రీమ్‌కు మైదా, బేకింగ్ పౌడర్ మిశ్రమాన్ని కూడా జత చేయాలి. అలాగే కొంచెం ఎసెన్స్ కూడా కలపాలి. తరువాత స్విస్‌రోల్ డబ్బా ఒకటి తీసుకుని దాని లోపల గోడలకు నెయ్యిగానీ, నూనెగానీ రాయాలి. తరువాత పైన కలిపి ఉంచుకున్న పదార్ధం అంతటిని ఈ డబ్బాలో వేయాలి.
ఈ డబ్బాను ఓవెన్‌లో ఉంచి 200 సెంటీగ్రేడ్ వద్ద 15 నిమిషాలు ఉంచాలి. తరువాత ఒక పేపర్ తీసుకుని పంచదార పోసి, దానిపైన ఓవెన్‌లో ఉడికించిన పదార్థాన్ని వేడి చల్లారకుండా వేయాలి. పదార్ధం వేడిగా ఉన్నప్పుడే స్పూన్ సాయంతో కేక్ మీద జామ్ రాయాలి. అవసరమనుకుంటే, గట్టిగా ఉండే కేక్ అంచులను తుంచేయవచ్చు. తరువాత ఈ కేక్‌పై ఐసింగ్ షుగర్, కోకో మొదలైన వాటితో అలంకరించి సర్వ్ చేయండి.
