ఉసిరి పచ్చడి చేయబోతున్నారా...?!
ఉసిరి పచ్చడిలో రెండు నిమ్మకాయల రసం కలిపితే పచ్చడి నల్లబడదు. బొంబాయి రవ్వ ఉప్మాలో పోపు వేగిన తర్వాత నీళ్లతో పాటు కొద్దిగా పాలు చేరిస్తే ఉప్మా మరింత రుచిగా ఉంటుంది. నిమ్మకాయలు పిండేశాక ఆ తొక్కలను వెంటనే పారేయకుండా కుక్కర్ అడుగున నిలవవుండే నీళ్లల్లో వేసేసుకోవాలి. ఉడికేటప్పుడు చెడు వాసన రాకుండా ఉంటుంది.

