1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. 1,133 Record Covid Deaths In India In 24 Hours, 75,809 Cases

విజృంభిస్తోన్న కరోనా.. రికార్డు స్థాయిలో 24 గంటల్లో 1133 మంది మృతి

1
భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24గంటల్లో అత్యధికంగా 1133మంది కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. ఒక్కరోజులో ఇన్ని మరణాలు సంభవించడం ఇదే తొలిసారి.

దీంతో దేశంలో కరోనా సోకి మరణించిన వారిసంఖ్య 72,775కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా కొవిడ్‌తో మరణిస్తున్న వారిలో దాదాపు 70శాతం మంది ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారేనని ప్రభుత్వం పేర్కొంది. 
 
ఇక దేశంలో రోజువారీ పాజిటివ్‌ కేసుల సంఖ్య 90వేలకు చేరిన సంగతి తెలిసిందే. గడిచిన 24గంటల్లో 75,809 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 42లక్షల 80వేలకు చేరింది. వీరిలో ఇప్పటికే 33లక్షల మంది కోలుకోగా మరో 8లక్షల 83వేల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 77శాతం ఉండగా, మరణాల రేటు 1.7శాతం ఉంది.
 
ఇకపోతే, సోమవారం రోజు దేశ్యాప్తంగా 10,98,621 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది... దీంతో... ఇప్పటి వరకు చేసిన టెస్ట్‌ల సంఖ్య 5,06,50,128కు పెరిగినట్టు పేర్కొంది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
నేషనల్ పోలీస్ అకాడెమీపై కరోనా పంజా : 80 మంది సిబ్బందికి పాజిటివ్