శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (10:16 IST)

పాకిస్థాన్ చెరలో 19 మంది భారతీయులు...

పాకిస్థాన్ చెరలో 19 మంది భారతీయులు బందీలుగా ఉన్నారు. వీరంతా దేశ సరిహద్దులను చట్టువిరుద్ధంగా దాటారని ఆరోపిస్తూ పాకిస్థాన్ అధికారులు వీరిని అరెస్టు చేశారు. రెండు నెలల క్రితం వాళ్లు దేశంలోకి ప్రవేశించారని, ప్రస్తుతం వివిధ జైళ్లలో ఉన్నారని పాకిస్థాన్ అధికారి ఒకరు వెల్లడించారు.
 
మరోవైపు, ఇదే తరహా కేసులో మరో ముగ్గురు బంగ్లాదేశ్‌ పౌరులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. దీనికి సంబంధించి వచ్చే నవంబర్‌ 9వ తేదీన పాకిస్థాన్ సుప్రీంకోర్టులో విచారణ జరుగబోతున్నదని వెల్లడించారు. గూఢచర్యం ఆరోపణలపై సదరు నిందితులను భద్రతా పరిరక్షణ చట్టం కింద అరెస్టు చేసినట్టు వివరించారు. 
 
పాకిస్థాన్ చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది. వారు గూఢచారులు కాదనీ, అమాయమకులైన తమ పౌరులపై పాకిస్థాన్ గూఢచర్యం ఆరోపణలు మోపి.. బందించిందని ఆరోపించారు. తక్షణం ఆ 19 మంది పౌరులను విడుదల చేయాలని భారత్ విజ్ఞప్తి చేసింది.