గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: సోమవారం, 7 సెప్టెంబరు 2020 (12:26 IST)

అక్రమాలను ఎదిరిస్తే బెదిరింపులు, భయాందోళనకు గురి చేస్తున్న లేడీ కార్పొరేటర్

జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీనగర్ కమ్యునిటీ హాలు, 13 షటర్లకు సంబంధించి స్థానికులు ఉద్యమాలు చేస్తున్న తరుణంలో 19 వార్డు కార్పొరేటర్ మేకల లలితా యాదవ్ కాలనీ వాసులతో షటర్‌ల స్థలం గురించి మాట్లాడిన టెలిఫోన్ సంభాషణ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
 
ఈ విషయమై బస్తి వాసులు ఆమెకు ఫోన్ చేయగా షట్టర్ ఎక్కడివి, అసలు కమ్యూనిటీ హాల్ అనేదే లేదంటూ దబాయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా స్థానికులనే మీరెవరు, మీకు ఈ కాలనీ విషయాలతో ఏం సంబంధం అంటూ దుర్భాషలాడారు. అంతేకాక సదరు షటర్ల స్థలం చింత శేఖర్ కుటుంబానిదేనని వారికే వత్తాసు పలుకుతూ స్థానికులను నోటికి వచ్చినట్లు తిడుతూ, భయాందోళనకు గురిచేసేవిధంగా ఆమె ఫోన్ సంభాషణ ఉంది.
 
దీనిపై స్పందించిన కాలనీ వాసులు మీడియాతో మాట్లాడుతూ రాజీవ్ గాంధీ నగర్‌లో కబ్జాకు గురైన కమ్యూనిటీ హాల్ మరియు షెటర్లను గతంలో చట్టపరంగా రెవిన్యూ శాఖ వారు సీజ్ చేసినప్పటికీ, కబ్జాదారులైన చింత శేఖర్ ఫ్యామిలీకి 19వ డివిజన్ కార్పొరేటర్ మేక లలిత యాదవ్ గారు అనుకూలంగా వ్యవహరిస్తూ కమ్యూనిటీ హాల్ మరియు షెటర్లును వారికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది.
 
ప్రజల వైపు నిలబడి ప్రజల ఆస్థి ప్రజలకు ఉపయోగపడేలా చూడాలని వారు కోరారు. అలాగే ఆక్రమణలకు వ్యతిరేకంగా పోరాడుతున్న తమపై గూండాలు, భూకబ్జాదారులంటూ అసత్య ఆరోపణలు చేస్తూ బురద జల్లుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏదిఏమైనా ప్రజల ఆస్థి ప్రజలకు దక్కేవరకు ప్రతిపక్షాలను, ప్రజా సంఘాలను, కుల సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కాలనీ వాసులు తెలిపారు.