మీ పప్పులు నా దగ్గర ఉడకవ్... టార్గెట్ చేస్తే రిజైన్ చేస్తా : సీఎం యడ్యూరప్ప

bs yaddyurappa
ఠాగూర్| Last Updated: గురువారం, 16 జనవరి 2020 (10:59 IST)
ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్పకు పట్టరాని కోపం వచ్చింది. తనను టార్గెట్ చేస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానేగానీ.. మీ ఒత్తిళ్ళకు తలొగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పైగా, ఎవరి వల్ల అయితే, ఈ ప్రభుత్వం నిలబడివుందో అలాంటి ఎమ్మెల్యేలందరికీ మంత్రి పదవులు ఇవ్వాల్సివుందని ఆయన తేల్చిచెప్పారు.

బుధవారం హరిహరలో జరిగిన జాతర ఉత్సవంలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప పాల్గొన్నారు. ఈ వేడుకలో వచనానంద స్వామీజీ పంచమశాలి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన అనుచరుడైన ఎమ్మెల్యే మురుగేశ్ నిరాణీకి మంత్రి పదవి ఇవ్వాలని వచనానంద
సూచించారు. అలా చేయకుంటే పంచమశాలీలంతా దూరమవుతారని ముఖ్యమంత్రిని హెచ్చరించారు.

ఈ వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి యడ్యూరప్పకు పట్టరాని కోపం వచ్చింది. ఉన్నఫళంగా తన సీటులో నుంచి పైకిలేచిన యడ్యూరప్ప.. తన పరిస్థితిని అర్థఁ చేసుకోవాలంటూ కోరారు. బీజేపీ కోసం 17 మంది రాజీనామాలు చేశారన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుచేసుకోవాలని కోరారు. వారికి మంత్రి పదవులు ఇవ్వాల్సి వుందని, ప్రస్తుత ప్రభుత్వం వారి సహకారంతోనే నడుస్తుదని చెప్పారు. అందువల్ల తనను టార్గెట్ చేస్తే, రిజైన్ చేసేస్తానని అన్నారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలు ఇపుడు కన్నడనాట చర్చనీయాంశంగా మారాయి.దీనిపై మరింత చదవండి :