శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 జనవరి 2020 (18:13 IST)

'మా' ఉపాధ్యక్ష పదవికి డాక్టర్ రాజశేఖర్ రాజీనామా

మూవీ ఆర్టిస్ట్స్ ఆసోసియేషన్స్ (మా) ఉపాధ్యక్ష పదవికి హీరో డాక్టర్ రాజశేఖర్ రాజీనామా చేశారు. హైదరాబాద్‌ నగరంలో జరిగిన మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో రాజశేఖర్ ప్రవర్తన, చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపడమే కాకుండా, పెద్ద వివాదానికి దారితీశాయి. రాజశేఖర్ వ్యవహారశైలిపై మెగాస్టార్ చిరంజీవితో పాటు.. హీరో మోహన్ బాబు వంటి స్టార్ హీరోలు తీవ్రంగా తప్పుబట్టారు. 
 
పైగా రాజశేఖర్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందిగా చిరంజీవి మా కమిటీకి సూచించారు. దీంతో తనన భర్త రాజశేఖర్ మాటలకు ఆయన భార్య జీవితా రాజశేఖర్ సభా ముఖంగా క్షమాపణలు చెప్పారు. ఈ నేపథ్యంలో హీరో రాజశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 'మా' ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖ రాశారు. మా అధ్యక్షుడు నరేశ్ వైఖరి మనస్తాపం కలిగించిందని లేఖలో పేర్కొన్నారు.