శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 2 జనవరి 2020 (16:58 IST)

రాజశేఖర్ ఓ కిడ్... అతడితో సంసారం చేసే నాకు తెలుసు: చిరు ముందు జీవిత

మా అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ సభలో ఎంత సముదాయిద్దామని అనుకున్నా... జీవిత-రాజశేఖర్ దంపతులు మాత్రం తాము ఏమి అనుకుంటున్నారో అది చెప్పకుండా మైకును వదిలిపెట్టలేదు. అంతకుముందు చిరంజీవి చెప్పిన మాటలపై రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు సభలో రచ్చగా మార్చేశాయి. వాటిపై మా సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా, ఆ తర్వాత మైకు అందుకున్న మా కార్యదర్శి జీవిత కూడా కాదుకాదంటూనే మాట్లాడారు. 
 
తన భర్త రాజశేఖర్‌ది ఓ చిన్నపిల్లవాడి మనస్తత్వమనీ, మనసులో ఏదీ దాచుకోలేడనీ, అతడితో సంసారం చేసే తనకు ఈ విషయం తెలుసుననీ చెప్పుకొచ్చారు. చిరంజీవి, మోహన్ బాబు తదితర సినీ పెద్దల సమక్షంలో ఆమె కలిసి వుందామని చెపుతూనే భర్త రాజశేఖర్ వ్యాఖ్యలను సమర్థించే ప్రయత్నం చేశారు. 
 
ఆమె మాట్లాడుతూ వుండగానే మోహన్ బాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏదేమైనప్పటికీ మా డైరీ ఎంతో హుందాగా జరుపుదామనుకున్న సినీ పెద్దలకు జీవిత-రాజశేఖర్‌లు చేదు గుళికలను అయితే మింగించారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.