శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 సెప్టెంబరు 2020 (23:05 IST)

తమిళనాడులో కోవిడ్ విజృంభణ.. 24 గంటల్లో 89 మంది మృతి

తమిళనాడులో కోవిడ్ విజృంభిస్తోంది. ప్రతిరోజూ ఐదు వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు 24 గంటల వ్యవధిలో అక్కడ కొత్తగా 5776 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. 
 
ఫలితంగా ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,69,256కు చేరింది. అందులో 4,10,116 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో 51,215 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
 
ఇక కరోనా మరణాలు కూడా తమిళనాడులో క్రమం తప్పకుండా నమోదవుతూనే ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో కొత్తగా 89 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,925కు చేరింది.