1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Delta Plus "Variant Of Concern", Says Centre, Warns Three States

డెల్టా ప్లస్ కోవిడ్ వేరియంట్.. నాలుగు రాష్ట్రాలకు పాకింది..

Delta Plus Variant
కరోనా థర్డ్ వేవ్ ప్రజలను భయపెడుతోంది. కొత్తగా వెలుగులోకి వచ్చిన ఈ డెల్టా ప్లస్ కోవిడ్ వేరియంట్ భారత్‌లో కోవిడ్ మూడో దశకి ప్రధాన కారణం అయ్యే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో ఇది మన దేశంలో నాలుగు రాష్ట్రాలకు విస్తరించింది. 
 
మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్‌, కర్ణాటకలో ఈ వేరియంట్ విస్తరించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించగా మహారాష్ట్రలో అత్యధికంగా ఇప్పటివరకు 21 డెల్టాప్లస్ కేసులను గుర్తించారు. ఈ వేరియంట్‌తోనే ఇప్పుడు అక్కడ మూడోముప్పు పొంచి ఉందని ఆరోగ్యశాఖ ఇదివరకే అంచనా వేసింది.
 
మరోవైపు కేరళలో మూడు కేసులు, కర్ణాటకలో రెండు, మధ్యప్రదేశ్‌లో ఒక కేసు బయటపడినట్టు ఆయా రాష్ట్రాల ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. డెల్టాప్లస్ వేరియంట్ మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్‌టెయిల్‌ ఔషధాన్ని ఏమారుస్తుందనే నివేదికలు ఆందోళన కలిగిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ హెచ్చరించింది. 
 
థర్డ్ వేవ్ రావడం అనేది ఎంతటి ఆందోళన అనిపిస్తుందో.. డెల్టాప్లస్ రూపంలో థర్డ్ వేవ్ వస్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేదానిపై ఇప్పుడు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
About Writer
సెల్వి