1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Dhruv Jurel got India back in the game: Michael Vaughan hails batter's 'solid technique'

ఐదుగురు వరల్డ్ క్లాస్ ప్లేయర్లు లేకపోయినా భారత్ గెలిచింది.. : మైఖేల్ వాన్

Michael Vaughan
స్వదేశంలో పర్యాటక ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌లలో మూడింటిలో గెలిచింది. దీంతో ఐదు టెస్టా మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలివుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. అయితే, భారత్ క్రికెట్ వరుస విజయాలు, ఇంగ్లండ్ ఆటతీరుపై ఆ జట్టు మాజీ సారథి మైఖేల్ వాన్ స్పందించారు. 
 
"భారత క్రికెట్ జట్టులో వరల్డ్ క్లాస్ ప్లేయర్లు ఐదుగురు లేరు. పైగా ఆ జట్టు టాస్ ఓడిపోయింది. తొలి ఇన్నింగ్స్‌‍లో ప్రత్యర్థి కంటే తక్కువ పరుగులు చేసింది. అయినప్పటికీ మ్యాచ్ గెలిచింది" అంటూ కితాబిచ్చాడు. ఈ మ్యాచ్ పూర్తి ఘనత టీమిండియాకే దక్కుతుందన్నారు. ఈ టెస్టు విజయం ఎంతో స్ఫూర్తిదాయకమని అని వాన్ పేర్కొన్నారు. చాలామంది యువ ఆటగాళ్ళు భారత జట్టులోకి వచ్చారని, వారు చాలాకాలం పాట జట్టులో కొనసాగే అవకాశాలు ఉన్నాయని ప్రశంసించారు. 
 
నిజానికి ఏ చిన్న అవకాశం లభించినా భారత్‌పై విరుచుకుపడే మైఖేల్ వాన్ మాత్రం రాంచీ టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. ఓ దశలో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 120 పరుగుకే ఐదు వికెట్లు కోల్పోగానే వాన్ రెచ్చిపోయాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ల దెబ్బకు టీమిండియా బ్యాటర్లు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. 
About Writer
వరుణ్
తర్వాతి కథనం
ఐపీఎల్‌ సీజన్‌కు విరాట్ కోహ్లీ దూరం? గవాస్కర్ ఆసక్తికర ట్వీట్స్