గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (12:42 IST)

ఐపీఎల్‌ సీజన్‌కు విరాట్ కోహ్లీ దూరం? గవాస్కర్ ఆసక్తికర ట్వీట్స్

sunil gavaskar
భారత క్రికెట్ జట్టు ఆటగాడు విరాట్ కోహ్లీ స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. దీనికి కారణం.. ఆయన భార్య అనుష్క రెండో బిడ్డకు జన్మనివ్వడమే. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న వీరు.. త్వరలోనే స్వదేశానికి రావొచ్చు. పైపెచ్చు.. విరాట్ కోహ్లీ తిరిగి భారత క్రికెట్ జట్టుతో కలుస్తాడని భావిస్తున్నారు. అయితే, స్వదేశంలో ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఆడకపోవడంపై భారత్ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాత్రం విరాట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు. 
 
సుదీర్ఘ విరామం తర్వాత క్రికెట్ ఆడబోతున్న విరాట్ పరుగుల దాహం తీర్చుకోబోతున్నాదా? అని ప్రశ్నించగా.. 'అతడు ఐపీఎల్ ఆడతాడా?' అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ''విరాట్ కోహ్లీ బహుశా ఐపీఎల్‌కు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. ఏదో కారణం వల్ల అతను ఆడకపోవచ్చు.." అన్నారు గవాస్కర్ అభిప్రాయపడ్డారు. 
 
కాగా, ఐపీఎల్ 2024 ఎడిషన్ మార్చి 22న ఆరంభం కానుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. రాంచీ టెస్టులో టీమిండియా విజయానికి ప్రధాన కారణమైన యువ బ్యాటర్ ధ్రువ్ జురెల్‌పై గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించారు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న వికెట్ కీపర్ - బ్యాటర్ ధ్రువ్ జురెల్ ఈ ఏడాది ఐపీఎల్‌లో సూపర్ స్టార్ కావచ్చునని గవాస్కర్ అన్నాడు. 
 
బ్యాటింగ్ ఆర్డర్‌లో ధ్రువ్ జురెల్ స్థానాన్ని ముందుకు జరిపే అవకాశం ఉందన్నాడు. టెస్ట్ మ్యాచ్‌లో ఈ స్థాయి ప్రదర్శన చూస్తుంటే జురెల్ సూపర్ స్టార్ కావచ్చని అన్నారు. కాగా ఆడిన రెండవ టెస్ట్ మ్యాచ్‌లోనే జురెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. తొలి ఇన్నింగ్స్ 90 పరుగులు, రెండో ఇన్నింగ్స్ 39 (నాటౌట్) పరుగులు చేసి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు' దక్కించుకున్న విషయం తెలిసిందే.