సంబంధిత వార్తలు
- రాంచీ టెస్టు.. నిలకడగా రాణిస్తున్న యశస్వి జైస్వాల్- గిల్ అదుర్స్
- 147 యేళ్ల టెస్ట్ క్రికెటర్లో ఒకే ఒక్కడు యశస్వి జైస్వాల్
- రాజ్‌కోట్ టెస్ట్ మ్యాచ్ : టార్గెట్ 557 రన్స్... ఓటమి దిశగా ఇంగ్లండ్
- డబుల్ సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ : ఇంగ్లండ్ ముంగిట 557 విజయలక్ష్యం
- రాజ్ కోట్ టెస్టు: యశస్వి జైస్వాల్ రెండో సెంచరీ
యశస్వి జైస్వాల్ అదుర్స్.. 12 సిక్సర్లతో వీరేంద్ర సెహ్వాగ్ రికార్డ్ బ్రేక్
Yashasvi Jaiswal
యశస్వి జైస్వాల్ ఇప్పుడు 2024లో టెస్టు క్రికెట్‌లో 23 సిక్సర్లు కొట్టాడు. తద్వారా 2008లో సెహ్వాగ్ కొట్టిన 22 సిక్సర్ల రికార్డును, 2022లో రిషబ్ పంత్ రికార్డును అధిగమించాడు.
16 ఏళ్ల కిందటే అంటే 2008లో భారత్ తరఫున ఒకే క్యాలెండర్ ఇయర్‌లో టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా సెహ్వాగ్ రికార్డు సృష్టించాడు. ఆ ఏడాది సెహ్వాగ్ 14 టెస్టుల్లో 22 సిక్సర్లు బాదాడు.
అయితే తాజాగా 2024లో యశస్వి జైస్వాల్ తన ఐదో టెస్టులో సెహ్వాగ్ 22 సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ఏడాది ఐదో టెస్టులోనే యశస్వి ఈ ఘనత సాధించాడు.
రిషబ్ పంత్ 21 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. పంత్ 2022లో ఈ రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ (19 సిక్సర్లు, 2019), మయాంక్ అగర్వాల్ (18 సిక్సర్లు, 2019) ఉన్నారు. తాజా ఇన్నింగ్స్‌లో యశస్వి 117 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 73 పరుగులు చేశాడు.
ఇంగ్లండ్‌తో సిరీస్‌లో యశస్వి జైస్వాల్ ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. విరాట్ కోహ్లి, వినోద్ కాంబ్లీ తర్వాత వరుసగా రెండు టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన మూడో భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. రాజ్‌కోట్ డబుల్ సెంచరీలో యశస్వి 12 సిక్సర్లు బాదాడు.
